• విష్ణుషట్పదీ స్తోత్రం

    నారాయణ నారాయణ జయ గోవింద హరే |నారాయణ నారాయణ జయ గోపాల హరే ||

  • శ్రీ రామ

    ఆపదం అపహర్థారమ్ దాతారం సర్వ సంపదం, లోకాభి రామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహమ్I

  • శ్రీ సీతామాత

    త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ, హనుమాన్ యత్న మాస్తాయ దు:ఖ: క్షయ కరోభవ

  • ఓం నమ:శివాయ:

    చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ , చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ I

  • శ్రీమాత్రే నమః

    అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మాయమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్

  • శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు

    పురుషోవిష్ణు రిత్యుక్తః శివోనానామతః స్మృతః I అవ్యక్తం తు ఉమాదేవీ శ్రీర్వా పద్మ నిభేక్షణా I తత్ సంయోగా దహంకారః స చ సేనాపతిరుహః I

పూజ్యుల మాట లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

గురువు



ఇంకా చదవండి »

మంచి మాట



ఇంకా చదవండి »

ఒక సత్యాన్వేషకుడి జీవితాదర్శాలు

మహామహులు ఎక్కడినుంచో రారు. మన మధ్యలోంచే వస్తారు. మట్టిలోంచే వస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఎంత మందినో తన ఆలోచనలతో, తన జీవన విధానంతో, తన వ్యాఖ్యానాలతో ప్రభావితం చేసిన జిడ్డు కృష్ణమూర్తి వివిధ సందర్భాల్లో స్వయంగా రాసిన అనేక అంశాల్ని ‘‘కామెంటరీస్ఆన్లివింగ్‌’’ పేరుతో ఆంగ్లంలో ప్రచురించారు. పుస్తకాన్ని ప్రసిద్ధ కథారచయిత్రి అబ్బూరి ఛాయాదేవి తేటతెలుగులోకి అనువదించారు. ‘‘మన జీవితాలు’’ పేరుతో గ్రంథం తెలుగు పాఠకులకు అందుబాటులో ఉంది. ఇంతకీ గ్రంథంలో ఏముందో చూద్దాం.

జిడ్డు కృష్ణమూర్తి రచనలుగా చెలామణిలో ఉన్న అనేకానేక రచనలకీ, గ్రంథానికీ ఉన్న తేడా ఏమిటంటే అవి అన్నీ ఆయన వివిధ సందర్భాల్లో వ్యక్తం చేసిన అభిప్రాయాలు. అంటే మౌఖికంగా వ్యక్తం చేసినవన్నమాట. కామెంటరీస్ఆన్లివింగ్‌’ పేరుతో వెలువడినవి మాత్రం ఆయనే స్వయంగా రాసినవన్నమాట.

* ఆకాంక్ష ఏరకమైనదైనా, సంఘం కోసం గాని, వ్యక్తిగత మోక్షం కోసం గాని, ఆత్మశుద్ధి కోసం గాని తక్షణం చర్య తీసుకోకుండా తప్పించుకునేటట్లు చేస్తుంది. కోరిక అనేది ఎప్పుడూ భవిష్యత్తుకి సంబంధించినదే... అస్తిత్వం అనేది ప్రస్తుతంలోనే ఉంది. అస్తిత్వంలో ఉండటమే అత్యున్నతమైన పరివర్తన.

* కుతూహలం కనపరచటం అర్థం చేసుకోవటానికి మార్గం కాదు. స్వీయ జ్ఞానంతోనే అవగాహన కలుగుతుంది. బాధపడే వాళ్లు ఎప్పుడూ కుతూహలం కనపరచరు. ఉత్తి ­హలతో కూడిన కుతూహలం ఆత్మజ్ఞానానికి అవరోధం.

* ఆలోచన ఆవేశపూర్తిమైనదీ, ఉద్రిక్తకరమైనదీ కాబట్టి అది ప్రేమ కాదు. ఆలోచన ఉన్నప్పుడు ప్రేమకి తావులేదు. ఆలోచన జ్ఞాపకాల మీద ఆధారపడి ఉంటుంది. ప్రేమ జ్ఞాపకం కాదు.

* సత్యాన్ని అర్థం చేసుకోవటంలో గురువూ లేడూ, శిష్యుడూ లేడు, పురోగమించిన వాడూ లేడు. అధోగతిలో ఉన్నవాడూ లేడు. గడించిన క్షణం యొక్క భారంగాని చిహ్నంగాని లేకుండా ఉన్నదానిని, అంటే వర్తమానాన్ని అనుక్షణమూ అర్థం చేసుకోవటమే సత్యం.

* లోకంలో గాని, ఇంకోచోట గాని ప్రతిఫలం చూపుతానన్న వాడిని కాస్త జాగ్రత్తగా కనిపెట్టి ఉండండి.

* సంపద, సుఖం, హోదా - వీటిని వదిలిపెట్టటం అంత కష్టమేమీకాదు. కాని, ఏదో ఉండాలనీ, ఏదో అవాలనీ పడే తాపత్రయాన్ని వదిలిపెట్టాలంటే విశేషమైన తెలివీ, అవగాహనా కావలసి ఉంటుంది.

* మీరు సత్యంలోని అత్యున్నత ఆనందాన్ని చవిచూడాలంటే అన్నిరకాల పూజల్నీ, సిద్ధాంత రీతుల్నీ వదిలించుకోవాలి.

* జ్ఞానం అనేది రెండు చీకట్ల మధ్య తళుక్కుమనే మెరుపు. కాని జ్ఞానం చీకటి పైకిగాని, దానికన్న ముందుకిగాని పోలేదు. సాంకేతిక నైపుణ్యానికి జ్ఞానం అవసరమే. యంత్రంలో బొగ్గు అవసరమైనట్లు. కాని, తెలియని దానిని అది చేరుకోలేదు. తెలియనిది తెలిసిన దానిలో చిక్కుకునేది కాదు. తెలియనిది ఆవిష్కృతం కావటానికి ఉన్న జ్ఞానాన్ని తొలగించుకోవాలి.

* ‘నా’, ‘నాదిఅని అనుకున్నప్పుడు హృదయంలో ఔదార్యం ఉండదు.

* మాన్యత అనేది ఒక శాపం. మనస్సునీ, హృదయాన్నీ హరించివేయగలిగేటంతచెడ్డది’. మనకు తెలియకుండానే మనలో దూరి మన ప్రేమను ధ్వంసం చేస్తుంది.

* మత సంబంధమైనది గానీ, రాజకీయమైనది గానీ, మరే సిద్ధాంతాన్ని గానీ అనుసరించినందువల్ల సమైక్యత సిద్ధించదు. విస్తృతమైన, ప్రగాఢమైన ఎరుక, చైతన్యం ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. ఎరుక చైతన్యపు లోతుల్లోకి కూడా పోవాలి. ­రికే పైపై ఫలితాలతో తృప్తిపడితే చాలదు.

* అనుభవం ఒకటి, అనుభవం పొందటం వేరొకటి. గతానుభవం అనేది అనుభవించడానికి ప్రతిబంధకం. గతానుభవం ఎంత ఆహ్లాదకరమైనదైనా, ఎంత అసహ్యకరమైనదైనా, ప్రస్తుతం ‘‘అనుభవిస్తూ’’ ఉండటం అనే దాన్ని వికసించనియ్యదు.

* సద్గుణం హృదయానికి సంబంధించినది; మనస్సుకి చెందినది కాదు. మనస్సు ఒక సద్గుణాన్ని అలవరచుకుంటున్నదంటే బాగా కపటంగా ఆలోచిస్తున్నట్లే. అదొక ఆత్మరక్షణ. పరిసరాలకనుగుణంగా, తెలివిగా సర్దుకుపోవటమే.

* కాలం అన్నింటినీ దోచేస్తుందని తెలిసి కాలరహితమైన దానికోసం ప్రాకులాడతాం.

* మనలో ఉన్నవి ఎన్నో; ఒకటి కాదు. ఉన్నవన్నీ పోతేగాని ఒకటి అవదు. అవన్నీ ఒకటితో ఒకటి పోట్లాడుకుంటూ రోజూ రాత్రీ, పగలూ గొడవచేస్తూ ఉంటాయి. పోరాటమే జీవితంలోని బాధ. ఒకదాన్ని నాశనం చేస్తాం. దాని స్థానంలో మరొకటి బయలుదేరుతుంది. రకంగా అనంతంగా సాగుతూ ఉన్నట్లుండేదే మన జీవితం!

* ప్రేమను పోల్చి చూడటం, దానిచుట్టూ కంచె కట్టడం కుదరదు.

* మనస్సు తెలిసిన దాన్నుంచి తెలిసిన దానికి కదులుతూ ఉంటుంది. మీకు తెలియనిదాన్ని గురించి మీరు ఆలోచించలేరు. అది అసంభవం. మీరు ఆలోచించేదంతా తెలిసిన దాన్నుంచే వస్తుంది.

* సత్యం గురించి చెప్పటానికి వీలుకాదు. వీలున్నట్లయితే, అది సత్యమే కాదింక! సత్యాన్ని అన్వేషించలేరు. ‘మీరులేనప్పుడేసత్యంఉంటుంది.

* మంచి పౌరుడు మంచి మనిషి అయి ఉండాలని లేదు. కాని మంచి మనిషి అయి ఉంటే అతడు సరియైన పౌరుడు అయితీరుతాడు... వివేకవంతుడైన మంచి మనిషి మంచి సమాజానికి దోహదం చేస్తాడు. కాని మంచి పౌరుడు మనిషి అత్యున్నత వివేకాన్ని పొందగలిగే సమాజాన్ని సృష్టించలేడు. పౌరుడు ఆధిక్యం ప్రదర్శిస్తున్నప్పుడు పౌరుడికీ, మనిషికీ మధ్య సంఘర్షణ అనివార్యం.

మనిషిని కావాలని నిర్లక్ష్యంచేసే సమాజమైనా నాశనమవుతుంది. మనిషి మానసిక ప్రక్రియ అర్థం చేసుకున్నప్పుడే పౌరుడికీ మనిషికీ సామరస్యం కుదురుతుంది.

* పై డాబుసరి ఎంత ఎక్కువగా ఉంటే లోపలి దారిద్య్రం అంత ఎక్కువగా ఉంటుంది.

* మన నమ్మకం ప్రకారమే జీవితం గడపాలనుకుంటాం. ఏదో ఒక నమూనా లేనట్లయితే పని అయినా ఎలా సాధ్యం?

* ప్రచారకులు మతాన్ని ప్రచారం చేసినా, లౌకిక వాదాన్ని ప్రచారం చేసినా సత్యాన్ని చెప్పేవారు మాత్రం కాదు.

* అహంతో కూడిన కార్యకలాపాలన్నీ సంఘర్షణకీ, దుఃఖానికీ కారణమవుతాయి.

* మనలో చాలా మంది భ్రమలలో బతకడానికీ ఇష్టపడతారు. ఇంకా తీవ్రమైన, విస్తారమైన భ్రమలను కనుక్కోవటంలో ఆనందం ఉంటుంది. కానీ, భ్రమలను పోగొట్టుకుంటామన్న భయమే నిజాన్నీ, వాస్తవాన్నీ కప్పిపెట్టి, దాన్ని కనిపించకుండా చేస్తుంది. వాస్తవికతని అర్థం చేసుకునే శక్తి మనకి లేక కాదు. వాస్తవికతని తిరస్కరించి భ్రమలను పట్టుకోవటం వల్లనే మనం భయపడుతూ ఉంటాం.

‘‘మన జీవితాలు’’లో ఎనభై ఎనిమిది అంశాలపై జిడ్డు కృష్ణమూర్తి స్వయంగా రాతపూర్వకంగా తెలియచేసిన అభిప్రాయాల సమాహారమిది. సమన్వయకర్త డా|| గజాననరావు అన్నట్లు ‘‘దర్పణంలా మనల్ని మనమే పరిశీలించుకునే అవకాశం కల్పించే’’విగా వ్యాఖ్యానాలు సాగుతున్నాయి. జిడ్డు కృష్ణమూర్తి జీవితాన్ని ఎంత లోతుగా, గంభీరంగా, విశాలంగా అర్థం చేసుకున్నారో వ్యాఖ్యానాలు చాటుతున్నాయి. మనోతత్వ విచారణ, తాత్వికత, మత ధర్మాల్ని కలిపిన ఆయన బోధనలు సమగ్రమైన, సంపూర్ణ జీవిత దర్శనాన్ని పాఠకులకు అందిస్తున్నాయనడంలో సందేహంలేదు.


(మన జీవితాలు; జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు; అనువాదం: అబ్బూరి ఛాయాదేవి; ప్రచురణ: ప్రగతి పబ్లిషర్స్‌, హైదరాబాద్‌; పుటలు: 325; వెల: 125 రూ.లు)

ఇంకా చదవండి »

తీపి జ్ఞ్యాపకం






ఇంకా చదవండి »

మంచి మాట





ఇంకా చదవండి »

పుట్టిన రోజునాడు చదవవలిసిన శ్లోకం




ఇంకా చదవండి »

జంతూనాం నరజన్మ దుర్లభం

జంతూనాం నరజన్మ దుర్లభం అంటే ప్రాణ కోటిలో మనుష్య జన్మ లభించటం గొప్ప అదృష్టం అని మహనీయులు చెప్తుండగా లోకంలో ఎందుకు బ్రతుకుతున్నామో, ఎందుకు బ్రతకాలో తెలియని వారే అనేకులు కనబడుతున్నారు. విజ్ఞుడైన మనుష్యుడు ఇహమున ధర్మ, భోగాలని; పరంలో ముక్తిని సాధించటం కోసం బ్రతుకుతాడు. జన్మ సార్థకం అవడానికి ఏది సాధించాలన్నా ఉత్తమ మార్గం ధర్మాచరణ. అట్టి ధర్మాన్ని ఆచరించటానికి ప్రధాన సాధనం ఈ శరీరమే. అందుకే "శరీర మాద్యం ఖలు ధర్మసాధనం" అని ఋషులచే పేర్కొనబడింది. కాబట్టి ధార్మికుని ప్రథమ కర్తవ్యం అటువంటి ధర్మ సాధనమైన శరీరాన్ని రక్షించుకొనటమే. ఏదైనా సాధించాలంటే సాధనం బాగుండాలి. తుప్పు కట్టిన కత్తితో యుద్ధం చేయలేడు. కాబట్టి యుద్ధానికి వెళ్ళేవాడు సాధనమైన కత్తికి పదును పెట్టుకోవాలి. ప్రయాణానికి సాధనం వాహనం. ప్రయాణం చేయదల్చుకొన్నవాడు వాహనాన్ని బాగుచేసుకొనాలి. అలాగే ధర్మకార్యం చేయాలన్నా ముక్తిని పొందాలన్నా సాధనమైన శరీరాన్ని అనుకూలంగా సిద్ధం చేసికొనాలి. ఆ లక్ష్యంతో మనకు మహర్షులు అందించిన మార్గమే సదాచారం. సదాచారం వలననే మంచి బుద్ధిని, బుద్ధిననుసరించి నడువగల్గినట్లు శరీరాన్ని దిద్ది తీర్చుకోగల్గుతాము.

ప్రపంచ విఖ్యాత పండితుడు మాక్సుముల్లరు తమ అంతిమ దశలో భగవంతుని ప్రార్థిస్తూ తాను మరల పుడితే భారతదేశంలో పుట్టాలని కోరుకున్నాడట. ఇక్కడ పుట్టిన వారికా విలువ తెలియక ఈ పుణ్యభూమిని నిందిస్తున్నారు. ఆ పండితుడు అలా అనుకోవడానికి ప్రధానకారణం ఇక్కడి ఉత్తమ జీవన విధానం. సదాచార పూర్ణమైన జీవన విధానం. ఈ భారతీయుల జీవితంలోని ప్రధాన జీవం సదాచారమే అనే సత్యాన్ని గ్రహించిన నాడు వ్యక్తికి గాని, ఈ సమాజానికి గాని ధన్యత చేకూరి తీరుతుంది.


నిండా నూరేళ్ళు బ్రతికి సర్వవిధాల ఉన్నతిని సాధింపదగిన మనుష్యుడు అల్పాయుష్కుడై అకాల మరణం వాత పడుతున్నాడు. మరణమైనా కొంతమేలేగాని కొందరు జీవించినంత కాలం రోగ పీడితులై తమకు, తోటి వారికి కూడా భరింపరాని రీతిలో జీవింపగల్గుతున్నారు. "ఎప్పుడు ప్రాణం పోతుందా" అని ఎదురు చూచే స్థితికి కూడా వస్తున్నాడు. ఇహమునకు, పరమునకు కొరగాని పాడుజన్మను నిందించుకొనుట తప్ప అట్టి వారు చేయగలదిలేదు. సదాచార సంపద సాధిస్తే వారికీదురవస్థ ఏపడదు. చతుర్విధ పురుషర్థ సాధనే జీవిత లక్ష్యం. "ధర్మార్థ కామ మోక్షాణాం మూలముక్తం కళేబరం" అని అన్నిటికీ ఈ దేహమే మూలం కాబట్టి దీని రక్షణను సత్త్వ మార్గంలో జ్ఞాన మోక్షములకు అర్హమగునట్లు చూచుకొనాలి. ఇది ఐహిక భోగాన్నికోరుకొనేవారికే కాదు శరీరాన్ని అశాశ్వతంగా తలచే వేదాంతులకైనా తప్పదు. అందుకే "సర్వ మన్యత్ పరిత్యజ్య శరీర మనుపాలయేత్" అని అగ్నివేశముని అన్నిటినీ వదలి ముందు శరీరాన్ని రక్షించుకోమన్నాడు. "బలవర్ధకాహారాలు, కావలసినన్ని మందులతో శరీరాన్ని కాపాడుకోవచ్చుకదా!" అని ప్రశ్నింపవచ్చు. అలా కాపాడుకొనే దేహం ఇహానికే తప్ప పరానికి పనికి రాదు. సార్థక జన్మ కాదు. 

అలా జన్మ సార్థకత సాధించుకొనటానికి ఏకైక మార్గం సదాచారం. ఆ మార్గంలో నడచిన శరీరం మాత్రమే పురుషార్థ సాధకమైన హైందవ పవిత్ర శరీరం కాగలదు. సదాచారం వలన సమస్తము చేకూరుతాయి. మను ధర్మ శాస్త్రం "ఆచారా ల్లభతే హ్యాయు: - ఆచారా దీప్సితా: ప్రజా:| ఆచారా ద్ధన మక్షయ్యం - ఆచారో హం త్యలక్షణం|| అని సదాచారం వలన ఆయుర్ధాయం పెరుగుతుందని, సత్సంతానం లభిస్తుందని, తరగని సంపద చేకూరుతుందని, దుర్లక్షణాలన్నీ తొలగిపోతాయని చెప్తోంది. అది నిజం. సదాచార పరుడు అకాల మృత్యువు వాత పడడు. "అకాల రతి క్రియల వల్ల దుర్జనులు పుడతా"రని శాస్త్రం చెప్పింది. ఆ విషయం "సంధ్యా సమయంలో సంభోగం చేసినందువల్ల విశ్వవో బ్రహ్మ సంతానం రావణ కుంభకర్ణాదులు రాక్షసులయ్యా" రని పురాణం నిరూపిస్తోంది. అలా కాక సదాచార పరులైతే వారికి తప్పక సత్సంతానమే కలుగుతుంది. లోకంలో పుట్టే దుర్మార్గుల జన్మలకి ఇలాటి సదాచార లోపమే మూలం. "ఆరోగ్యమే మహాభాగ్య"మన్నట్లు సదాచారం చే దుర్వ్యయాలు లేక సంపద నిలచి ఉంటుంది. ఇక్కడ ఆచారమంటే అనర్థదాయకమైన మూడాచారం కాదు. ఆ మూడాచారం దు:ఖ హేతువు. సదాచార ధర్మాలు ఎప్పుడూ మానవులకు సుఖశాంతులనే ప్రసాదిస్తాయి. అందుకే "సుఖార్థా: సర్వభూతానాం - మతాః సర్వాః ప్రవృత్తయః | సుఖం చ న వినా ధర్మః - తస్మాత్ ధర్మ పరో భవ |" అని ప్రాణులకు సుఖ సంపాదకములుగానే మన మత ధర్మాలు ఏర్పడ్డాయి. మూఢాచారంతో స్నాన, అన్న, పానములు అక్రమంగా చేసి ధర్మాన్ని నిందించడం తగదు. ఒక డాక్టరు గారు స్వయంగా చెప్పిన సంఘటన ఇది. ఒకామె వ్యాధి గ్రస్తురాలైంది. శిరస్నానం తగదని చెప్పినా వినక అలాగే చేస్తూ దేవుళ్ళకు మ్రొక్కేది. వ్యాధి నయం కాలా. కొన్నాళ్ళకు బొట్టు లేకుండా కనబడి "క్రైస్తవమతం తీసుకున్నాక జబ్బు తగ్గిందండి" అంది. డాక్టరుగారు "ఇప్పుడు శిరఃస్నానం చేస్తున్నావా? అనడిగితే లేదంది. నేను చెప్పినట్లుగా చేసి ఉంటే మతం మారకపోయినా జబ్బు తగ్గి ఉండేది. నీ రోగం తగ్గడానికి కారణం మతం మార్పు కాదు. ఆచరణలో మార్పు అన్నారట ఆ డాక్టరు గారు. అలా మూఢాచారాలు కూడా మన ధర్మానికెంతో అపకారం చేస్తున్నాయి. హేతుబద్ధంగా సుఖశాంతులను కలిగించేదే మన సదాచారం అంతా. అలాకాని దశలో అన్నీ మూఢాచారాలుగానే పరిగణింపబడతాయి. కాబట్టి యోగ్యమగు ఆచారమే నిల్పి ధర్మాన్ని రక్షించాలి, శ్రౌత, స్మార్త కర్మలు చేయలేని వారికి సదాచారమే ఆ లోటు తీర్చగలది.

ఇంకా చదవండి »

హింసా? సమానత్వంమా ?

ఒకరోజు నేపాల్ మహారాజు తన సైన్యంతో అరణ్యానికి వేటకు వెళ్ళాడు. కొంతసేపయిన తరువాత రాజుగారి సైన్యాధిపతి ఒక పెద్దపులిపైకి తుపాకిని పేల్చాడు. తుపాకీ గుండు ఆ పులికి తగలకపోవటంతో అది తప్పించుకొని, పెద్దగా గాండ్రిస్తూ పరుగెత్తసాగింది. అదిచూసి రాజభటులు గుర్రాలమీద ఆ పులిని వెంబడించారు. ఆ పెద్దపులి పరుగెత్తి పరుగెత్తి ధ్యానమగ్నుడైన గణపతిస్వామి ఉన్నచోటికి చేరుకొని, ఆర్తనాదం చేస్తూ స్వామివారి పాదములవద్ద పిల్లిలాగా పడుకొన్నది. ఆ పులిచేసిన ఆర్తనాదాలు స్వామివారి ధ్యానస్థితి సడలిపోయింది. కన్నులు తెరవాఅనే వారి దృష్టి పులిమీద పడింది. ఆ పులి పరిస్థితిని అర్థం చేసుకున్న స్వామిఆ పులిశరీరాన్ని ఆప్యాయంగా నిమిరారు. ఇంతలో పులిని వెంటాడుతూ వచ్చిన రాజభటులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఆ అద్భుత దృశ్యాన్ని చూసి వారు నిశ్చేష్టులై నిలిచిపోయారు. స్వామివారు కరుణామయములైన చూపులతో ఆ భటులను తనవద్దకు జ్రమ్మని సంజ్ఞ చేశారు. వారు ఎంతో భక్తి ప్రపత్తులతోను, భయభ్రాంతులతోను స్వామివారి చెంతకు చేరి నమస్కరించారు. స్వామివారు చిరునవ్వుతో ఇలా అన్నారు. "మీరంతా ఇంత ఆశ్చర్యాన్ని పొందటానికి భయభ్రాంతులు కావటానికి కారణమేమిటి? మీరు మీ హింసా ప్రవృత్తిని విడిచిపెడితే క్రూరజంతువులు కూడా మిమ్మల్ని హింసించవు. అవి కూడా తమ హింసా ప్రవృత్తిని విడిచిపెడతాయి. ఈ పెద్దపులి ఇంత ప్రశాంతంగా పడి ఉండడమే అందుకు ప్రత్యక్షప్రమానము. ఇంతవరకూ మీరు దాని ప్రాణములు తియ్యాలనుకొన్నారు. కాని ఇప్పుడు ఈ పులి సునాయాసంగా మీ ప్రాణాలను తియ్యగలదు. అందువల్లనే దీనిని చూసి మీరు భయపడుతున్నారు. ఎవరికీ ఇంకొకరి ప్రాణాలు తీయటానికి అధికారం లేదు. ఒకవేళ అలాంటి అధికారం కనుక మీకు ఉంటే, దాని ప్రాణం మీరు ఎప్పుడో తీసి ఉండేవారు. ఈ ప్రపంచంలో అన్ని ప్రాణులు సమానులే. కనుక ఒకరిని మరొకరు హింసించటం మంచిదికారు. ఇక మీకు భయం లేదు. మీరు నిర్భయంగా, నిశ్చింతగా వెళ్ళి మీ అనుచర వర్గాన్ని చేరవచ్చు. నేటినుంచీ హింసాప్రవృత్తిని మానటానికి ప్రయత్నించండి." అని ప్రబోధించారు. స్వామివారి మాటలు విన్న ఆ రాజభటులు స్వాస్థ్యచిత్తులయ్యారు. ఎన్నడూ కనీ వినీ ఎరుగని దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసినవారు అవాక్కయ్యారు. స్వామివారి పాదధూళిని కన్నులకు అద్దుకొని, వారి అనుమతితో అక్కడినుంచి వెళ్ళిపోయారు. కొంతసేపటికి ఆ పెద్దపులి కూడా వెళ్ళిపోయింది.

ఇంకా చదవండి »

శ్రీ కంచి పరమాచార్య


ప్రపంచమంతా ఒకే సూర్యుడు వెలుగుతున్నాడు. ఓక దొసిలి నీళ్ళను శుద్ధంగ ఉన్న వసారాలో అక్కడక్కడ చిందిస్తే, ప్రతి నీటి చుక్కలోనూ సూర్యుని ప్రతి రూపము వెలుగొందుతుంది. అంతే కానీ, ప్రతి బిందువులోనూ ఒకొక్క సూర్యుడు లేడు. ఒకే సూర్యుడు అన్నిటిలోను ప్రతిఫలించినట్లేజగత్తులోని అన్నీ జీవుల్లోను ఒకే బ్రహ్మం చిన్న చిన్నవిగా మినుకు మినుకు,అని ప్రతి ఫలిస్తోంది.



ఇంకా చదవండి »

అంతర్ దర్సనం


ఇంకా చదవండి »

ద:ఖం తొలిగే త్రోవ


పరమవస్తువేదో తెలుసుకోవడానికి మనలో ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. జ్ఞానమనగా ఏమి? పరమవస్తువు తప్పించి వేరే ఏదీ ప్రపంచములో లేదు అన్నవిషయమే. ఆ ఒక్క పరతత్త్వమే అనేకమై విలసిల్లుతున్నది. ఈ అనేకమే సత్యమని భ్రమించేంతవరకు, దుఃఖం మనదాపులోనే ఉంటుంది. దుఃఖములూ మనశ్చాంచల్యమూ తొలగాలంటే ఒకేదారి. ఆ పరతత్త్వ చింతనే, తదనుసంధానమే. ఆ పరతత్త్వంలో లగ్నమైన మనస్సు చంచలరహితమై నిత్యసుఖానుభూతినందగలదు. జ్ఞానమంటే ఇదే.
సుఖదుఃఖములే సంసార. అవి బాహ్యానికి చెందినవి. అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటికి నిలుకడలేదు. గొప్ప ధనికుడు పెద్ద పదవిలో వున్నవాడు సుఖి అని మనం అనుకుంటాం. కానీ వానిని మనం పరామర్శించినామంటే, అతని కష్టములు నూర్లకొలది ఏకరువు పెడతాడు. అప్పుడు మనమున్న స్థితే మేలు అని మనకనిపిస్తుంది. ధనమున్న వాడి కాలమంతా ఈ ధనాన్ని ఏవిధంగా రక్షించడమనే విచారంతోనే నిండివుంటుంది. వాడికి మనశ్శాంతి ఎప్పుడూ కరవే.
దుఃఖం మనతో పుట్టినది. ఇది పూర్వ కర్మకృతం. దీనినుంచి తప్పించుకొనడం అశక్యం. ఐత్యే కర్మానుసారం కలిగే కష్టాలను క్షాంతితో ఓర్చుకొని శాంతంగా ఉండడానికొక మార్గమున్నది. అదే జ్ఞానమార్గము. చిత్తభ్రమ కలిగిన వానికి దుఃఖం స్థిరంగా ఉండదు. వానికి ఆనందమూ లేదు. సషుప్తిలో దుఃఖమూ లేదు. సుషుప్తిలో సుఖముగా ఉన్నామన్న ఎరుక కూడాలేదు. జ్ఞాని ఒక్కడే సతత జాగ్రదావస్థలో శాశ్వత సౌఖ్యాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అతనికి దేహక్లేశమున్నప్పటికీ, మనః క్లేశముండదు. బాహిరవిషయాటోపం అతన్ని ఏవిధంగానూ బాధించదు.

నీటిలో కడవ మునిగివున్నంతసేపు, మనకు దాని భారం తెలియది. కొంత పైకి లాగగానే కడవ బరువౌతుంది. అదే విధంగా మనకు కలిగే ప్రాపంచిక కష్టముల భారం, జ్ఞానమనే జలములో ముంచితే, దుఃఖం దూరం అవుతుంది. అన్ని క్లేశములకూ మందు జ్ఞానయోగమే.

ఇంకా చదవండి »

జై శ్రీరాం


 Sri Rama

శ్రీరామదూతం శిరసా నమామి!
తన కాంత తనువు  జేరి సుఖియింప,
మనము బొదలుచుండె ముక్తికాంత కౌగిలి జేరుటెప్పుడని,
ధన సంచయము సాధించు వశమున దిరుగుచుండ,
మనము దూరుచుండె కరచరణముల నేల కోవెలకెప్పుడు తిరుగవని,
ధారాపుత్రాదుల సుఖము చూసి సంతసించుచుండ,
మనము గేళి చేసె చూడవలసినది  ఎద్దియో తెలుసునా అని,
వ్యర్ధ భాషణముల కర్ణేంద్రియములు వినియోగింపుచుండ,
మనము మరియొకమారు తట్టె ఏల వినెదవీ వ్యర్ధార్ధములన్నియు యని,
కూడని మాటలు కూయుచుండ,
మనము తల్లడిల్లె ఏలడీతడు శ్రీహరి నామము పల్కడని,
అంతరమొప్పదు బాహ్యమందు జీవితము వ్యర్ధమగుచున్నదని,
బాహ్యము పడనీయదు అంతర్ముఖాలోచనను,
స్వామీ నీయందు నిశ్చలచిత్తముంచుదుమన్న, బాహ్యములు లాగుచున్నవి.
సరి పో బాహ్యము చూచుదుమన్న అంతరము నిత్యసంఘర్షణము గావించుచుండె,

ఇచటికి గాక మరినచటికి గాక నడుమ చెడిపోదునేమో, నీ పాదద్వయము నా మదినుంచి ఈ బాహ్యాంతర సంఘర్షణ రూపుమాపి స్వామీ, నన్ నీ పాదాశ్రయుం జేయవే!!!!


తోచిన తలపుల శ్రీహరి తోడుచేసి రాసితినిదినంతియే గాని, మరియేమిగాదు, భావదోషమైన, అర్ధదోషమైన పిన్నచేష్టలంచు పెద్దలు మన్నించగలరు.

ఇంకా చదవండి »